Pallavi : Satulala Chudare Sravana bahulashtami
gatalaya nadu reyi galige sri krishnudu
Charanam : Putte yapude chaturbhujalu sankhu chakralu
Ettu dhariyinchene ee krishnudu
atte kireetamu abharanalu dharinchi
etta yeduta nunnadu ee krishnudu
Charanam : Vachi brahmayu rudrudu vaakita nutiyinchaganu
ichaginchi vinuchunnadee krishnudu
muchataadi devakito munchi vasudevunito
hechchina mahimalato ee krishnudu
Charanam : Koda teera mari nandagopunaku yashodaku
idigo taa biddadaye nee krishnudu
adana sri venkateshudai alamelmanga goodi
yedutane unnadu ee krishnudu
పల్లవి : సతులాల చూడరే శ్రవణ బహుళాష్టమి
గతలాయ నడురేయి గలిగే శ్రీ కృష్ణుడు
చరణం : పుట్టే యపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు
ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడు
అట్టే కిరీటము ఆభరణాలు ధరించి
ఎట్ట ఎదుట నున్నాడు ఈ కృష్ణుడు
చరణం : వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతియించగాను
ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు
చరణం : కొద దీర మరి నంద గోపునకు యశోదకు
ఇదిగో తా బిద్దదాయె నీ కృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై అలమేల్మంగ గూడి
యెదుటనే నిలుచున్నాడీ కృష్ణుడు
No comments:
Post a Comment