Lyrics:
Pallavi : Shodasa Kalanidhiki shodasopacharamulu
Jaadatoda nichalunu samarpayami
Charanam 1: Alaru vishvatmakunaku aavaahanamide
Sarva nilayunaku aasanamu nemmi nide
ala ganga janakunaku arghya padyachamanalu
jaladhi sayikini majjanamide
Charanam 2: Vara peetaambarunaku vastralankaaramide
Sari sreemanthunaku bhushanamulive
dharanee dharunaku gandha pushpa dhoopamulu
tira mide koti surya tejunaku deepamu
Charanam 3: Amrutha madhanunaku adivo naivedyamu
Gami chandra netrunaku kappura videmu
Amarina sree venkatadri meedi devunaku
Tamito pradakshinalu dandamulu ivigo
పల్లవి : షోడస కళానిధికి షోడసోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి
చరణం 1 : అలరు విశ్వత్మకునకు ఆవాహనమిదే
సర్వ నిలయునకు ఆసనము నెమ్మి నిదే
అల గంగా జనకునకు అర్ఘ్య పాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే
చరణం 2 : వర పీతాంబరునకు వస్త్రాలంకారమిదే
సరి శ్రీమంతునకు భూషణములివే
ధరణీ ధరునకు గంధ పుష్ప ధూపములు
తిరమిదే కోటి సూర్య తేజునకు దీపము
చరణం 3 : అమృత మథనునకు అదివో నైవేద్యము
గమి చంద్ర నేత్రునకు కప్పుర విడెము
అమరిన శ్రీ వేంకటాద్రి మీది దేవునకు
తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో